MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 4:00 am Digital Edition : Medak Today

వైభవంగా మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు: హరీష్ రావు, మహిపాల్ రెడ్డి ఆశీస్సులు.

పటాన్ చెరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడమే లక్ష్యం: బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐలాపుర్ మాణిక్ యాదవ్

అమీన్‌పూర్,ఏప్రిల్,2,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఐలాపుర్ మాణిక్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ని మరియు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఘన సత్కారం:

మాణిక్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ జడ్పిటిసి బాల్ రెడ్డి కూడా పాల్గొని మాణిక్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు:

అనంతరం ఐలాపుర్ మాణిక్ యాదవ్ మాట్లాడుతూ.. తన పుట్టినరోజు సందర్భంగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరియు అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

మాణిక్ యాదవ్ మాటల్లో ముఖ్య అంశాలు:

సేవా కార్యక్రమాలు:

  • “అమీన్‌పూర్ డివిజన్ అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషిస్తున్నాను. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాను, మున్ముందు హరీష్ రావు , స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరియు ఆదర్శ్ రెడ్డి సహకారంతో మరిన్ని ప్రజాహిత పనులు చేస్తాను.”
  • రాజకీయ లక్ష్యం: “రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న అన్ని కార్పొరేటర్ స్థానాల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయడమే మా లక్ష్యం. నాయకులందరి సమన్వయంతో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తాం.”
  • కృతజ్ఞత: తనపై చూపిస్తున్న అభిమానానికి రుణపడి ఉంటానని, అందరి ఆశీస్సులతో నియోజకవర్గ అభివృద్ధిలో చురుగ్గా పాల్గొంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ వేడుకల్లో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,కార్యకర్తలు మరియు అమీన్‌పూర్ డివిజన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.