MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 6:23 am Digital Edition : Shiva Kumar

వడియారం గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లికి బోనాలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.

చేగుంట,జూన్,29,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ధ్వజసంభ ప్రతిష్ట
అమ్మవారి కళ్యాణం అనంతరం సాయంత్రం బోనాలు తీయడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈరోజు ఇంత ఘనంగా బోనాలు తీయడం ఎంతో సంతోషకరంగా ఉంది గ్రామ ఆడపడుచులు బంధువులు మిత్రులు అందరి సహకారంతో అమ్మవారికి బోనాలు తీయడం ఎంతో సాధన సంతోషకరంగా ఉంది ఈ గుడి కట్టడానికి సహకరించిన గ్రామ ప్రజలకు బంధుమిత్రులకు అధికారులకు మాన గ్రామ పాలకవర్గ సభ్యులకు దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.ఆలయం అభివృద్ధి గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పశువు అన్ని గ్రామం కూడా అభివృద్ధి పథంలో ముందుండాలి దానికి మన పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు,ముదిరాజ్ సంఘం సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ఆడపడుచులు బంధుమిత్రులు గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.