వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు..బీ కేర్‌ఫుల్..!

వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు..బీ కేర్‌ఫుల్..! హైదరాబాద్‌,నవంబర్‌,19, మెదక్ టుడే న్యూస్: రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు పేర్కొన్నది. ఆదిలాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌ జిల్లాలతోపాటు మరో ఐదు జిల్లాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకు...