వడియారం గ్రామంలో పరాభవ నూతన సంవత్సర ఉగాది వేడుకలు.

చేగుంట,మార్చి,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో( హనుమాన్ గుడి)శివ పంచాయతన దేవాలయంలో గ్రామ సర్పంచ్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పురోహితుడువెంకటేశ్వర శర్మ తో పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగినది. ఈ ఉగాది పండుగను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్ మాట్లాడుతూ మా వడియారం గ్రామ పురోహితుడు అయిన వెంకటేశ్వర శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించాము పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరానికి సంబంధించిన శుభ ఫలితాలను వివరించారు.గ్రామానికి మంచి కాలం ప్రారంభమవుతుందని,అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని తెలిపారు.అనుకూలమైన వర్షపాతం ఉండి వ్యవసాయం సస్యశ్యామలంగా...