MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 4:46 am Digital Edition : Medak Today

వడియారం గ్రామంలో ఇఫ్తార్ విందు.

ముఖ్య అతిథిగా హాజరు అయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

చేగుంట,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పవిత్రమైన రంజన్ మాసంసందర్భంగా వడియారం మండల మైనారిటీ నాయకులు మహ్మద్ నదీమ్ హాసన్ అలీ ఆధ్వర్యంలో ఇస్తార్ విందుకార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగాదుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నదీమ్ మాట్లాడుతూ మా వడియారం గ్రామంలో మా కుటుంబ పరంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉన్నది. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మేము అందరం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక్కపొద్దులు ఉంటాము సాయంకాలం నమాజు చేసుకున్న తర్వాత భోజనం చేయడం జరుగుతుంది. ఇలా ఇస్తారు విందు అందరికీ భోజనాలు పెట్టడం నాకు ఆ దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డితోపాటు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఎఎంసి ఛైర్మెన్ తాడేం వెంగళరావు, గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, ఉపసర్పంచ్ లు, ఎఎంసి డైరెక్టర్లు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ మైనారిటీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.