ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య…
పాపన్నపేట,మార్చి,29,మెదక్ టుడే న్యూస్:మనస్థాపంతో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం…గ్రామానికి చెందిన ఫిరంగి సత్యనారాయణ (50) కల్లు వ్యాపారం చేస్తూ జీవితం సాగిస్తున్నాడు.కాగా వారం రోజుల క్రితం ఈయన పెద్ద కూతురు ఎంగేజ్ మెంట్ జరిగింది.దీంతో త్వరలో పెళ్లి ఉండడంతో పెళ్లికి డబ్బులు లేక అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు.అప్పు ఎక్కడ దొరక్కపోవడంతో మనస్థాపం చెందిన అతను శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి...