ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.
పాపన్నపేట,ఏప్రిల్,28,మెదక్ టుడే న్యూస్:మద్యం మత్తులో క్షణికావేశంలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నాగ్సాన్ పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు.గ్రామానికి చెందిన కాగితాల జహంగీర్(39) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.గత కొన్ని రోజులుగా ప్రతి రోజు మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు.తాగుడుకు బానిస మారడంతో చిన్నపాటి అప్పులు పెరిగి అవి ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందుతున్నాడు.ఈ క్రమంలో సోమవారం రాత్రి సమయంలో మద్యం సేవించి ఓ దావత్ లో...