ఉపాధి హామీ కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం..?సెల్‌ఫోన్లలో మునిగితేలుతున్న సిబ్బంది..
ప్రజల ప్రశ్నలకు సమాధానమే లేదు..!పాపన్నపేట ఎన్‌ఆర్‌ఈజీఎస్ కార్యాలయ పనితీరుపై తీవ్ర విమర్శలు.. పాపన్నపేట,జూలై 24 (మెదక్ టుడే న్యూస్):పాపన్నపేట మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) కార్యాలయంలో ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి.కార్యాలయానికి వచ్చే ప్రజలను పట్టించుకోకుండా కొందరు ఉద్యోగులు సెల్‌ఫోన్లలో వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు కార్యాలయాన్ని సందర్శించిన విలేకరులకు...