ఉగాది ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ శ్రీ కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం.
మెదక్,హవేలీ ఘన్పూర్,మార్చి,18,మెదక్ టుడే న్యూస్: మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం కూచంపల్లి గ్రామంలో గల శ్రీశ్రీ కూచాద్రి వెంకటేశ్వర దేవాలయం ఉగాది బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ఉత్సవంలో భాగంగా కుచంపల్లి గ్రామంలో గల శ్రీ కూచాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవం జరుగుతాయి నేటి 19 తారీకు నుండి 24వ తేదీ వరకు ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవ జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు 19వ తేదీన ఉదయం 4.30 నిమిషాలకు సుప్రభాతము అభిషేకము...