MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 10:31 am Digital Edition : Medak Today

డీసీసీబీలో పొదుపు చేస్తే అత్యధిక వడ్డీ..

•డీసీసీబీలో పొదుపు చేస్తే అత్యధిక వడ్డీ

పాపన్నపేట,నవంబర్,13,మెదక్ టుడే న్యూస్:

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పొదుపు చేస్తే అత్యధిక వడ్డీని పొందవచ్చునని బ్రాంచ్ మేనేజర్ దీపక్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో డీసీసీబీ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీసీసీబీ నూతనంగా ప్రవేశపెట్టిన స్వర్ణనిధి డిపాజిట్ ద్వారా 444 రోజులకుగాను అత్యధికంగా 8.25 శాతం వడ్డీని పొందవచ్చన్నారు. డిపాజిట్లపై డీఐసీ జీసీ ఇన్సూరెన్స్ సదుపాయంతో పాటు యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంక్ గ్యారంటీ, ఏటీఎం, లాకరు సౌకర్యాన్ని ఖాతా దారులకు అందిస్తున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీకి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణా లతో పాటు బంగారు ఆభరణాలపై అత్యధి కంగా గ్రాముకి రూ.7400 రుణాన్ని అందిస్తు న్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.