పాపన్నపేట,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:
ధాన్యం డబ్బులు చెల్లింపులో మరింత వేగం పెంచాలి కలెక్టర్
జిల్లాలో ఇప్పటివరకు
1,14,077.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు
•కొనుగోళ్లల్లో ఇంకా వేగం పెరగాలి
•ట్యాగ్ చేసిన మిల్లులకే ధాన్యం తరలించాలి
•కొనుగోళ్ల పర్యవేక్షణ కై పటిష్ట చర్యలు
•జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ధాన్యం డబ్బులు చెల్లింపులలో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.పాపన్నపేట మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసిల్దార్ తో కలిసి పరిశీలించారు.ముందుగా కేంద్రానికి ఇప్పటివరకు వచ్చిన ధాన్యం ఎంత, అందులో ఎంత మేరకు కొనుగోలు చేసారు… ఇంకా తేమ శాతం రావాల్సిన ధాన్యం ఎంత ఉంది, కొనుగోలు పూర్తి అయిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసారా లేదా, అలాగే కొనుగోలు అయిన ధాన్యంట్యాగ్ చేసిన మిల్లులకి తరలిస్తున్నారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,ఈ ఖరీఫ్ సీజన్ కి సంబందించి…ధాన్యం డబ్బుల చెల్లింపులలో మరింత వేగం పెంచి ముందుకు పోవాలని తెలిపారు.గత సంవత్సరం ఇదే నెలలో 10,185 మంది రైతుల నుంచి 61,231.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 4.71 కోట్ల రూపాయలను చెల్లించగా,ప్రస్తుత సీజన్ కి… ఇప్పటివరకు 27,252 మంది రైతుల నుండి 1,14,077.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 102.84 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు.తేమ శాతం వచ్చి కొనుగోలు కి సిద్ధంగా ఉన్న ధాన్యం కొనుగోలు వేగవంతం గా జరగాలన్నారు.అదే విధంగా కొనుగోలు కి సంబందించిన
రిజిస్టర్ లన్ని పక్కాగా నిర్వహించాలన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా.
స్పెషల్ ఇన్స్పెక్షన్ టీం ను నియమించి పర్యవేక్షణ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
