MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 9:45 am Digital Edition : Medak Today

ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు..

మెదక్, నవంబర్, 13, మెదక్ టుడే న్యూస్:

•ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.

క్రీడాకారులకు ఫుట్బాల్ స్పోర్ట్స్ ‌కిట్స్
అందజేసిన దాత శ్రీ హర్ష సేవలను అభినందించిన అదనపు కలెక్టర్ నగేష్,పాఠశాల క్రీడా సమాఖ్య మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 16వ తేదీ వరకు నల్లగొండలో జరగనున్న ఎస్ జి ఎఫ్, రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొననున్న 17 సంవత్సరాలలోపు బాలబాలికల ఉమ్మడి మెదక్ జిల్లా జట్టుకు ఫుట్బాల్ కిట్స్ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నగేష్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు మెదక్ జిల్లా అని ,క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన దాత ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ సర్వీసెస్ ఎం.డి హర్ష సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఫుట్బాల్ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఫుట్‌బాల్ పట్ల మీకున్న మక్కువ మైదానాన్ని మరింత ఉత్తేజపరుస్తూనే ఉండనివ్వండి! చివరి నిమిషంలో గెలిచిన గోల్‌తో ఉత్సాహంగా గడపాలని కోరుకుంటున్నాను! ఈ సంవత్సరం ఆనందం, విజయం మరియు ప్రేమతో హ్యాట్రిక్ సాధించండి!
అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా విద్యాధికారి విజయ, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ నాగరాజు. పీడీలు జి మాధవరెడ్డి, జట్టు కోచ్ స్వాతి పాల్గొన్నారు.