టీజీసెట్‌లో మెరిసిన వడియారం విద్యార్థి రాకేష్.

ఆనందోత్సవంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రాకేష్ టీజీసెట్-2026లో విశిష్ట ప్రతిభ కనబరిచాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ బ్రాంచ్ ర్యాంక్ సాధించడంతో పాటు 1493 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.రాకేష్ తన పాఠశాల విద్యను చేగుంటలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్‌లో పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్ రామంతాపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా అభ్యసించాడు. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి చూపిన రాకేష్ క్రమశిక్షణ,...