MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 3:44 am Digital Edition : Shiva Kumar

టీజీసెట్‌లో మెరిసిన వడియారం విద్యార్థి రాకేష్.

ఆనందోత్సవంలో కుటుంబ సభ్యులు బంధుమిత్రులు

చేగుంట,మే,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన రాకేష్ టీజీసెట్-2026లో విశిష్ట ప్రతిభ కనబరిచాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ బ్రాంచ్ ర్యాంక్ సాధించడంతో పాటు 1493 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.రాకేష్ తన పాఠశాల విద్యను చేగుంటలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్‌లో పూర్తి చేశాడు. అనంతరం హైదరాబాద్ రామంతాపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా అభ్యసించాడు. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి చూపిన రాకేష్ క్రమశిక్షణ, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రాకేష్ తండ్రి సత్యనారాయణ తన కుమారుడి విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు రాకేష్‌ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.వడియారం గ్రామానికి చెందిన విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.