📄 ePaper
Thursday, March 12, 2026
ADS
HomeNewsతప్పులు లేకుండా నామినేషన్ ప్రక్రియనామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలిజిల్లా కలెక్టర్...

తప్పులు లేకుండా నామినేషన్ ప్రక్రియనామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలిజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా రామాయంపేట జనవరి 30 మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి:నామినేషన్ దరఖాస్తుల్లో తప్పులు లేకుండా నింపాలని, నామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అధికారులకుసూచించారు.రామాయంపేట మున్సిపాలిటీకి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సాధారణ పరిశీలకులు రవి కిరణ్ గారితో కలిసి పరిశీలించారు.నామినేషన్ పత్రాలను, వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందించారు.ఎన్ని వార్డు ఉన్నాయీ? ఎన్ని నామినేషన్ వచ్చాయని ? సాధారణ పరిశీలకులు ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. తప్పులు లేకుండా నామినేషన్ ప్రక్రియ జరగాలని,నామినేషన్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలని,మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఎన్నికల సంఘం నియమానిబంధనను తూచా తప్పకుండా అనుసరించి నామినేషన్ ప్రక్రియ కొనసాగాలన్నారు.
నామినేషన్ పత్రాలతో పాటు జతచేసే జిరాక్స్లను సరిచూసి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments