సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత-హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక దృష్టి,జిల్లా ఎస్పీ. శ్రీనివాస రావు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో రోజుకు సగటున సుమారు 450 మంది...