స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ కి 20% సీట్లు కేటాయించాలి.

•పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్‌ కు వినతిపత్రం అందజేసిన యువజన నాయకులు. పటాన్‌చెరు, జనవరి 09:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూ 20 శాతం సీట్లు కేటాయించాలని పటాన్‌చెరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పసుల నవీన్ ముదిరాజ్ కోరారు.శుక్రవారం పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పసుల నవీన్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న...