శ్రీవారి నగర్‌లో అంగరంగ వైభవంగా గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర.

శ్రీవారి నగర్‌లో అంగరంగ వైభవంగా గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర రికార్డు స్థాయిలో రూ. 5,51,000లకు స్వామివారి లడ్డూ ప్రసాదం కైవసం భక్తిశ్రద్ధలతో దక్కించుకున్న ఆర్. తిరుపతి రాథోడ్ అమీన్‌పూర్, సెప్టెంబర్ 25:(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని శ్రీవారి నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 11 రోజులుగా విశేష పూజలందుకున్న శ్రీ వినాయక స్వామివారి నిమజ్జన మహోత్సవం, శోభాయాత్ర అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా సాగాయి. కాలనీ వాసుల జయజయధ్వానాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు,...