MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 4:58 am Digital Edition : SHIVA KUMAR

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా చెక్కును అందచేసిన ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి.

చేగుంట,మార్చ్,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేస్తూ జీవించే మెండ స్వామి (40) శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ భీమా పాలసీ తీసుకున్నారు.తీసుకున్న 06 నెలలకు ఆరోగ్యం బాగాలేక మరణించాడు ,
కంపెనీ నుండి 5,41,000 రూపాయిల బీమా చెక్కును .నామిని అయిన తన భార్య మెండే రాని,కి ఆదివారం నాడు
5లక్షల 41వేలు రూపాయలు
చెక్కును చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తమ బాధ్యతగా భావించి, సరైన బీమా కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ స్వామి వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ రవి, డీజీఎం సురేష్ , ఆర్ ఎం శ్రీనివాస్, డివో నరసింహులు, ఏజెంటు కోటగిరి ప్రశాంత్, బ్రాంచ్ ఉద్యోగులు, గ్రామస్తులు పాల్గొన్నారు.