శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం: ముఖ్య అతిథిగా హాజరైన ఆదర్శ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి.

రామచంద్రపురం,మే,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్ డివిజన్‌లో శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయానికి చేరుకున్న ఆదర్శ్ రెడ్డికి నిర్వహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని,...