శ్రీ మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనం..భక్తుల కొంగు బంగారం మన మైసమ్మ తల్లి-ప్రధాన అర్చకులు శివశ్రీ పంతులు.
శేరిలింగంపల్లి,ఆగస్టు,9,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి నుండి అమీన్‌పూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన వెలిసిన శ్రీ మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శివశ్రీ పంతులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి మైసమ్మ తల్లి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోందని తెలిపారు. భక్తుల కొరికలు తీర్చడంలో అమ్మవారి మహిమ అపారమని, ప్రతి...