శ్రీ గాయత్రీ ఆసుపత్రిలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.
వైద్య సేవలు, రికార్డులు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర పరిశీలన శంకరంపేట,(ఎ),ఆగస్టు,21, మెదక్ టుడే న్యూస్: శంకరంపేట (ఎ)లోని శ్రీ గాయత్రీ ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ గణేశ్వర్ శుక్రవారం వైద్య సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల రికార్డులు, సిబ్బంది విద్యార్హత ధ్రువపత్రాలు, వైద్య పరికరాలు, ఆపరేషన్ థియేటర్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఆసుపత్రిలో పీసీపీఎన్‌డీటీ చట్టంపై అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని,...