శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ముగిసిన గుప్త నవరాత్రి ఉత్సవాలు.

అమీన్ పూర్,జూలై,23,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమ్మవారు ప్రత్యేకంగా శాకంబరీ దేవి అవతారంలో భక్తులకు అలంకార దర్శనమిచ్చారు.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, విశేష అలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) దేవనాదం, ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నవరాత్రి వేడుకలు కన్నులపండువగా సాగాయి. తొమ్మిది...