MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 12:19 pm Digital Edition : SHIVA KUMAR

సొసైటీ లో భాగస్వాములే-డిమాండ్ వద్దు.

.మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్

పాపన్నపేట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్: ట్రాన్స్ జెండర్లు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని మెదక్ డిఎస్పీ ప్రసన్నకుమార్ వారికీ సూచించారు. సోమవారం పాపన్నపేట లోని ఓ ఫంక్షన్ హాల్ లో పోలీస్ అధికారులు నిర్వహించిన అవగాహన సమావేశంలో డిఎస్పీ మాట్లాడారు. సొసైటీలో అందరూ భాగస్వాములే అని,వివిధ గ్రామాలు, ఏడుపాయలలో శుభ కార్యాలలో ఇష్టా రీతిన డబ్బులు డిమాండ్ చేయవద్దన్నారు. గౌరవంగా ప్రవర్తించని యెడల చట్టం పరంగా చర్యలు ఉంటాయన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి హేమాభార్గవి,సిఐ జార్జి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.