పాపన్నపేట,డిసెంబర్,5,మెదక్ టుడే న్యూస్:
స్నేహ పూర్వకంగా పోటీ తత్వం తో మెలగాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రమైన పాపన్న పేట లోని దుర్గమ్మ గైన్ వద్ద స్థానిక ఎన్నికల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా కృషి చేయాలే తప్ప గొడవలు సృష్టిస్తే ఎన్నికల కేసులు నమోదు అవుతాయని. సామాన్య కేసుల కన్నా ఎన్నికల సమయంలో కేసులు నమోదు అయితే ప్రతి ఎన్నికల సమయంలో బైండోవర్ చేస్తారని. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగ, పాస్ పోర్ట్ లు రావని. ఎన్నికలు ఐదేండ్ల కొకసారి వస్తాయని. అందరూ కలిసి మెలిసి స్నేహ పూర్వక పోటీ తత్వం తో మెలగాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించకుండా ఉండాలని. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన, ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించిన చట్టరీత్య చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వ కుండా స్వేచ్చ తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యత తో ఉంచుతామన్నారు. ఎన్నికల ప్రచారాలు ఈ నెల 9వరకు ముగించాలని. పోలింగ్ కేంద్రం లో ప్రచారాలు నిర్వహించారాదని. పోలింగ్ బూత్ లలోకి చరవాణిలు నిషేధమని, ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెళ్ళే ప్రతి ఒక్కరూ ఓటరూ స్లిప్పు తోనే వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ జార్జ్, పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, గ్రామస్థులు పోలీసులు పాల్గొన్నారు.
