సెన్సెస్-2027 ఇండ్ల గణనకు ప్రజలు సహకరించాలి-చేగుంట తాసిల్దార్ శివప్రసాద్ పిలుపు.

చేగుంట,మే,9,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం, ‘సెన్సెస్-2027’ మొదటి దశలో భాగంగా మే 11 నుండి ప్రారంభం కానున్న ఇండ్ల గణన ప్రక్రియపై చేగుంట మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో శనివారం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ శివప్రసాద్ మాట్లాడుతూ, గణన కోసం వచ్చే ఎనిమరేటర్లకు ప్రజలు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ ప్రక్రియకు ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా గణన సమయంలో గోప్యతా నియమాల దృష్ట్యా ఆధార్...