సాయిబాబా కాలనీలో శివాలయం ప్రాంగణంలో పర్ణశాల నిర్మాణానికి భూమి పూజ.

(స్పెషల్ కరస్పాండెంట్)షాద్‌నగర్,ఏప్రిల్,12, మెదక్ టుడే న్యూస్:షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు సాయిబాబా కాలనీలో ఉన్న శివాలయం ప్రాంగణంలో పర్ణశాల మరియు రెండు గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని శివాలయ పూజారి రమామహేశ్వర్ అయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా, కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మంగ శంకర్ (ఏఎస్సీజీ), ప్రధాన కార్యదర్శి బొబ్బిలిగామ శ్రీనివాసులు దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో కాలనీ కోశాధికారి షాప్ శ్రీశైలం, సమన్వయకర్త డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు, గౌరవ అధ్యక్షుడు ఏ. ఆంజనేయులు...