సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలిగా మరోసారి సండ్రుగు స్రవంతి సతీష్.
చేగుంట,సెప్టెంబర్ 15 మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలిగా చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ ను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల సర్పంచ్ లు తెలిపారు.వినాయక చవితి సందర్భంగా మండలంలోని సర్పంచ్ లందరూ కలిసి ఎలాంటి హోదాలు లేకుండా ఒకే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారని, అయితే బి.కొండాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి తానే ఫోరం అధ్యక్షుడిగా ఫ్లెక్సీలు వేయించారని వారు ఆరోపించారు.దీనిపై స్పందిస్తూ మెజారిటీ సర్పంచ్ లు మాట్లాడుతూ - గత డిసెంబర్ 20న 15 మంది సర్పంచ్...