సమ్మక్క సారక్క జాతరకు సహకరించాలని అమీన్ పూర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి
అమీన్ పూర్,జనవరి,6,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సమ్మక్క-సారలమ్మ దేవాలయ గద్దెలపై ఈ ఏడాది నిర్వహించబోయే జాతరను పురస్కరించుకుని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి జిహెచ్ఎంసి అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం జి.హెచ్.ఎం.సి. అమీన్ పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా ఈ జాతరను లక్షలాది...