అమీన్ పూర్,జనవరి,6,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ సమ్మక్క-సారలమ్మ దేవాలయ గద్దెలపై ఈ ఏడాది నిర్వహించబోయే జాతరను పురస్కరించుకుని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి జిహెచ్ఎంసి అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం జి.హెచ్.ఎం.సి. అమీన్ పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నీలం బిక్షపతి మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా ఈ జాతరను లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఒక ఆచారంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్తులు గ్రామ పెద్దలు పటాన్చెరు నియోజకవర్గ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారంతోటే సమ్మక్క సారక్క జాతర ఇంత గ్రాండ్గా జరపడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ ఏడాది జాతర జనవరి 28 నుండి జనవరి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుందని పేర్కొన్నారు. గతంలో మున్సిపల్ సిబ్బంది అందించిన పారిశుద్ధ్య సేవల వల్ల భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొక్కులు చెల్లించుకున్నారని గుర్తుచేశారు.ఈ ఏడాది కూడా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిహెచ్ఎంసి శాఖ తరపున పూర్తి సహకారం అందించాలని, ముఖ్యంగా శుభ్రత (పారిశుద్ధ్యం) విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా జాతరను విజయవంతం చేయడంలో యంత్రాంగం తోడ్పడాలని కోరారు.