MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 May 2026, 3:36 am Digital Edition : Shiva Kumar

సంగాయిపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

కొల్చారం,మే,23,మెదక్ టుడే న్యూస్:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వావిద్యాలం నిర్వహిస్తున్న రైతులు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శనివారం కూల్చారం మండల సంగాయిపేట గ్రామంలో నిర్వహించారు. రాజేంద్రనగర్ హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రమీల వివిధ పంటలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు. ముఖ్యంగా వరిలో నరుమాడిలో యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి వివరిస్తూ వ్యవసాయ విశ్వావిద్యాలం వారు రూపొందించిన సన్న రకాలు KNM-1638,RNR-15048,HMT-SONA, WGL-42,WGL-962JGL-1798,వంటి సన్న విత్తనాలు ను పండించవలసిందిగా సూచించారు. పత్తి మొక్కజొన్న పంటలలో వచ్చే కలుపు చీడపిడల గురించి వివరిస్తూ పంట మార్పిడి పధ్ధతిని పాటించాలని సూచించారు. అలాగే జీవనియంత్రనా పద్ధతులను కూడా వివరించడం జరిగింది. పచ్చి రొట్టె ఎరువులు గురించి వివరిస్తూ జనుము, జీలుగ వంటి విత్తనాలను రైతు తన సొంత భూమిలో ఒక మడిలోనైనా పండించి దానిని రాబోయే పంటకాలానికి విత్తనంగా ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నివృత్తి పరచుకోవడంతోపాటు.. పంట మార్పిడి చేయడం తమకు ఇష్టమైనప్పటికీ కోతుల బెడద వల్ల కొంతవరకు ముందడుగు వేయలేకపోతున్నామని చెప్పారు. మొక్కజొన్న, జొన్న పొద్దు తిరుగుడు వంటి పంటలు వేసిన రైతులు తమకు కొనుగోలు కేంద్రాలు కొంతవరకు దగ్గరలో ఉండేలాగా ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ప్రమీల, గ్రామ సర్పంచ్ కుర్ర రత్నమ్మ ప్రభాకర్, ఎపిఓ ఛైర్మెన్ వెంకటరెడ్డి, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.