సామాన్య భక్తులే మాకు వీఐపీలు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

•బీరంగూడ గుట్టపై 24 గంటల్లోగా ఆక్రమణలు తొలగించాలి. అన్ని శాఖల సమన్వయంతో మహాశివరాత్రి జాతరను జయప్రదం చేయాలి. 4 నుండి 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం.. పకడ్బందీగా ఏర్పాట్లు. అధికారులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆదేశం. అమీన్‌పూర్,ఫిబ్రవరి,5,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో...