ఆషాఢమాసం తొలి ఆదివారం.. శాఖంబరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఏడు పాయల వన దుర్గమ్మ.
పాపన్నపేట,జూలై,19 (మెదక్ టుడే న్యూస్)రిపోర్టార్ఆ పి. దుర్గేష్షా గౌడ్ఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమ్మలగన్న అమ్మ శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని ఆదివారం శాఖంబరి దేవి రూపంలో అత్యంత వైభవంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా చేసిన ఈ విశేష అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచే అమ్మవారి ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి...