రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు సృష్టించకండి-స్థానికుల ఆందోళన.

రామచంద్రాపురం,జూన్,9,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.ప్రజల రాకపోకల సౌకర్యార్థం, ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన రామచంద్రాపురం బస్ డిపో – బీరంగూడ ప్రధాన రహదారి విస్తరణ పనులకు 'భెల్' ఉన్నతాధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనం కోసం సాగుతున్న పనులను నిలిపివేయడం ఏమాత్రపు సమంజసం కాదని వారు మండిపడ్డారు.గత అరవై ఏళ్లుగా వినియోగంలో ఉన్న ఈ రహదారిని విస్తరించేందుకు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పనులు ప్రారంభమయ్యాయి. కాలువ పక్కన కొనసాగుతున్న ఈ...