రోడ్లపై ఆక్రమణల తొలగింపు: అమీన్‌పూర్‌లో రెండో రోజు కొనసాగిన జిహెచ్ఎంసి కూల్చివేతలు.

అమీన్‌పూర్,మార్చి,26,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని అమీన్‌పూర్ జిహెచ్ఎంసి పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండో రోజూ కూడా అధికారుల కూల్చివేత పర్వం వేగంగా కొనసాగింది. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులు, పాన్ డబ్బాలు, తోపుడు బండ్లు మరియు రోడ్డుపైకి వచ్చిన భారీ ప్రకటన బోర్డులను జెసిబి సహాయంతో అధికారులు తొలగించారు. నిబంధనలు అందరికీ సమానమే: అధికారులు ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు షాపు యజమానులకు...