MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 5:08 pm Digital Edition : Medak Today

రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి..

•రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి

(స్టేట్ బ్యూరో)నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

రోడ్డు ప్రమాదం.. నవ వధువు మృతి
తెలంగాణ : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల శివారులో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవ వధువు ప్రణతి (24) మృతి చెందింది. ఉద్యోగ నిమిత్తం సిద్దిపేట నుంచి హైదరాబాద్‌‌కు బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రణతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త సాయికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పెద్ద చెప్యాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.