MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 2:11 pm Digital Edition : Medak Today

రివాల్వర్ తో బెదిరించి రూ.2.5 లక్షల దోపిడి..

•ఏడు పాయల్లో సంఘటన

•వచ్చింది దొంగలా.. పోలీసులా …!

•బాధితులపై దాడి చేసిన దుండగులు

•పోలీసులని ఎదిరించలేకపోయామన్న బాధితులు

పాపన్నపేట,నవంబర్,26,మెదక్ టుడే న్యూస్:

ఆధ్యాత్మిక కేంద్రం లో..అలజడి చెలరేగింది.ఏడు పాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడి జరిగింది. రివాల్వర్ తో బెదిరించిన అగంతకులు హల్చల్ చేశారు. విందు ముగించుకొని సరదాగా పేకాట ఆడుతున్న వారిపై దాడికి తెగ బడ్డారు.ఆపై దర్జాగా రెండున్నర లక్షలు దోచుకెళ్లారు. మంగళ వారం రాత్రి జరిగిన సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.అది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల.దుర్గమ్మ తల్లి సన్నిధి
సుమారు 60 మంది భక్తులు హీరాలాల్ షెడ్లో అర్ధరాత్రి సేధా తీరుతున్నారు అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం, అదే సమయంలో వారు సేద తీరుతున్న హీర లాల్ గెస్ట్ హౌస్ గేటు దూకి మూకుమ్మడిగా పదిమంది దుండగులు లోనికి చొరబడ్డారు. కొందరు మొదటి గేటు వద్ద కాపలా ఉండగా మరికొందరు రెండో గేటు కాడ పహార కాచారు, మరో 6 మంది షెడ్లోనికి చొరబడ్డారు, చొరబడ్డ వారి వద్ద రివాల్వర్ ఉండడం కు తోడు దానితో భక్తులను బెదిరించారు. 60 మంది వరకు ఉన్న భక్తులు రివాల్వర్ చూసి కిమ్మనలేక నిచ్చేస్తులయ్యారు, దుండగులు లోనికి ప్రవేశించగానే రివాల్వర్తో బెదిరించి, వారివద్ద ఉన్న సెల్ ఫోన్లన్నీ తమకు అప్పగించాల్సిందిగా హుకుం జారీ చేశారు, భయభ్రాంతులకి గురైన భక్తులు అందరి సెల్ ఫోన్లు తీసి దుండగులకు అప్పగించారు, అందులోనుండి తేరుకున్న మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ రాజు అనే యువకుడు వారిని అడ్డగించే ప్రయత్నం చేశాడు వెంటనే, దుండగులు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు, దీంతో తోటి భక్తుడి పై దాడితో భయ భ్రాంతులకు గురైన మిగతా భక్తులు నిచ్చేస్తుల్లై వారి వద్ద ఉన్న రెండున్నర లక్షలు దుండగులకు అప్పగించారు, అవి అందగానే దుండగులు గోడదుకి పరారయ్యారు,
ఏడుపాయలలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్న ఇవి ఏమాత్రం బయటకు పొక్కడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి,

•రివాల్వర్ చూసి భయపడ్డాం…

•భక్తుడు ధర్మకర్ రాజు, మెదక్

మేము ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం విందు ఏర్పాటు చేసుకున్నాం, అర్ధరాత్రి కొంతమంది సేద తీరుతుండగా మరి కొంతమంది పేకాట ఆడుతున్నారు అదే సమయంలో పది మంది వరకు దుండగులు రివాల్వర్ తో వచ్చారు, వారిని చూసి అందరూ భయపడ్డారు నేనొక్కడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశా నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో నేను కూడా చేసేది లేక సరెండర్ అయ్యాను. ఆపై దుండగులు మా వద్ద ఉన్న రెండున్నర లక్షల నగదు ఎత్తుకొని పరారయ్యారు,