MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 4:49 am Digital Edition : SHIVA KUMAR

రీజియన్ పరిధిలో ఎక్సలెంట్ జోన్ ఛైర్పర్సన్ అవార్డును అందుకున్న లయన్ ఆకుల సుఖేందర్.

చేగుంట,మార్చి,15,మెదక్ టుడే న్యూస్:చేగుంట లయన్స్ క్లబ్ నుండి లయన్స్ ఇంటర్నేషనల్ 320 డి జిల్లా పరిధిలో ఉన్న సిద్దిపేట రీజియన్ లో లయన్ ఆకుల సుఖేందర్ జోన్ ఛైర్పర్సన్ గా చేగుంట, తూప్రాన్ తో పాటు రామాయంపేట లోని రెండు క్లబ్ లకు బాధ్యతలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్న సుఖేందర్ కు గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్లో ఆదివారం నాడు లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబురావు,గవర్నర్ లయన్ అమర్నాథ్ మరియు రీజియన్ చైర్ పర్సన్ లయన్ సంజయ్ గుప్తా చేతుల మీదుగా ఉత్తమ జోన్ చైర్పర్సన్ అవార్డును అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఫస్ట్ గవర్నర్ విజయలక్ష్మి ,సెకండ్ గవర్నర్ నరసింహరాజు ,జిల్లా సెక్రెటరీ లైన్ శ్రీనివాస్ రెడ్డి,మర్రి ప్రవీణ్, శ్రీధర్ పరమేశ్వరి చారి, నేతి శ్రీనివాస్ మల్లేష్ గౌడ్ ,లింగమూర్తి ,వీర బ్రహ్మం ,రామ్ రెడ్డి ,శంభుని శ్రీనివాస్, నాగరాజు ,అనిల్ నర్సింలు ,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.