MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 1:39 am Digital Edition : Medak Today

రిటైర్డ్ ఎస్పీ కీర్తిశేషులు పి. పద్మాకర్ రావు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం.

(స్పెషల్ కరస్పాండెంట్)
షాద్ నగర్, ఏప్రిల్ 25,మెదక్ టుడే న్యూస్:
రిటైర్డ్ ఎస్పీ కీర్తిశేషులు పి. పద్మాకర్ రావు జయంతిని పురస్కరించుకుని, వారి స్మృతికి నివాళిగా రాంనగర్ ఆంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వారి కుమారుడు డా. నంద కిశోర్ (యు ఎస్ ఏ) సౌజన్యంతో, ఆయన బావమరిది విక్రమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సామాజిక వేత్త, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కొమ్ము వెంకన్న బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మాకర్ రావు తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన అంకిత భావంతో విధులు నిర్వహించిన తీరు ఆదర్శప్రాయమని కొనియాడారు. గత పది సంవత్సరాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను, ముఖ్యంగా విక్రమ్‌ను అభినందించారు.
అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న పద్మను కూడా అభినందించిన ఆయన, పద్మాకర్ రావు కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన పరికరాలు, పిల్లలకు అవసరమైన వస్తువులు అందించడం గొప్ప విషయమని అన్నారు.ఈసందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ, పద్మాకర్ రావు కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
సేవా కార్యక్రమం లో భాగంగా
రాంనగర్ అంగన్వాడీ కేంద్రానికి ఎల్ ఈ డి టీవీ, క్యారమ్ బోర్డు, ప్లేట్లు, గ్లాసులు అందజేత
చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ
23 అంగన్వాడీ కేంద్రాలకు 250 పలకలు పంపిణీ
ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సుశీల, సీడీపీఓ ఉదయ, కౌన్సిలర్ వాణి, దుర్గా ప్రసాద్, శివాని, పిల్లల తల్లిదండ్రులు, రాంనగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సీడీపీఓ ఉదయ మాట్లాడుతూ: “ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైనవి. నిర్వాహకులు చేపడుతున్న ఈ కార్యక్రమం అభినందనీయం.” అని అన్నారు.
ఎస్సై సుశీల మాట్లాడుతూ: “చిన్నారుల కోసం ఇలాంటి సేవలు చేయడం గొప్ప విషయం అని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.”
చినిర్వాహకులను సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి, వందన సమర్పణ చేశారు.