MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 7:02 am Digital Edition : Medak Today

రాత్రి 11లోపు దుకాణాలు మూసివేయాలి-నిబంధనలు అతిక్రమిస్తే కేసులు: డీఎస్పీ ప్రసన్న కుమార్.

మెదక్,ఏప్రిల్,5,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ డివిజన్ పరిధిలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా రాత్రి 11 గంటలలోపు అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్లు తప్పనిసరిగా మూసివేయాలని మెదక్ డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.రాత్రి 11 గంటల అనంతరం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఆ సమయంలో తెరిచి ఉన్న దుకాణాలు లేదా సంస్థలు గుర్తిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేయబడతాయని పేర్కొన్నారు.ప్రజలు, వ్యాపారులు పోలీస్ శాఖతో సహకరించి ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని, అందరూ కలిసి మెదక్ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.