రసాయన శాస్త్రంలో నగరపు లక్ష్మీకుమారికి పీహెచ్.డీ.

పటాన్ చెరు,మే,1,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి,హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నగరపు లక్ష్మీకుమారి డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘క్లోఫరాబైన్, డెసిటాబైన్, బెలినోస్టాట్, బోర్టెజోమిబ్ తయారీలో కీలక మధ్యస్థ పదార్థాలు, క్రియాశీల ఔషధ పదార్థాల (ఏపీఐ) సంశ్లేషణకు అధునాతన విధానాల’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిత్తలూరి సుధాకర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో...