రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్,(స్టేట్ బ్యూరో)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్: రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్బుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు. పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీ రావు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది. రామోజీ రావు 89 వ జయంతిని...