MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 7:59 am Digital Edition : Medak Today

పుట్టినరోజు వేళ సామాజిక సేవ: బీరంగూడలో దండు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రం.

సేవా కార్యక్రమాలు అభినందనీయం – పటాన్‌చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

అమీన్ పూర్,ఏప్రిల్,29,(మెదక్ టుడే)న్యూస్:ప్రతినిధి,అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ దండు రమేష్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని, సామాజిక బాధ్యతతో బీరంగూడ ఐక్యత హోమ్స్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,దండు రమేష్ యాదవ్ తన పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా, ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. పుట్టినరోజున ఇటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు రావడం ఆయనలోని సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు. రమేష్ యాదవ్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిరంతరం ప్రజల మనిషిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.దండు రమేష్ యాదవ్ మాట్లాడుతూ,నా పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే చిన్న పని చేయాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించాను. బాటసారుల దాహార్తిని తీర్చడం నాకు ఎంతో తృప్తినిస్తోంది.””ప్రజల ఆశీస్సులు, పార్టీ నాయకుల సహకారం ఉంటే భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతాను. వేసవి ముగిసే వరకు ఈ చలివేంద్రం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరాయంగా అందిస్తాం.కాట శ్రీనివాస్ గౌడ్ స్వయంగా గ్లాసుతో బాటసారులకు మంచినీరు అందించి చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దండు రమేష్ యాదవ్‌కు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ కౌన్సిలర్స్ లావణ్య, మున్నా, అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ శశిధర్ రెడ్డి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ సుధాకర్ యాదవ్, మన్నె రవీందర్, లక్ష్మణ్, నరేష్, సతీష్, శ్రీనివాస్, సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ మహిళలు,కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.