ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి-జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.

-ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు.భూసార పరీక్షల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవ కార్యక్రమాలు మెదక్ జిల్లాలో పలు రైతు వేదికలలోఘనంగా జరుగుతున్నాయి. మెదక్,మే,4,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్ కౌడిపల్లి రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూల మొక్కలు సాగు చేసుకోవాలని సూచించారు. కౌడిపల్లి, చేగుంట,...