ప్రాథమిక పాఠశాల కర్నాల్ పల్లిలో స్వయం పరిపాలన దినోత్సవం.
చేగుంట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కర్నాల్ పల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని ఐదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి మిగతా తరగతులకు పాఠాలను బోధించారు. ఒక్కొక్కరు టీచర్లు తెలుగు ఇంగ్లీషు మ్యాస్ ఇవిఎస్ సబ్జెక్టులను తీసుకొని పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టబోయిన సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు టీచర్ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ పాఠాలను బోధించడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందని,నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, బాధ్యతలు తెలుస్తాయని, పోటీ...