పాపన్నపేట, డిసెంబర్, 1, మెదక్ టుడే న్యూస్:
పాపన్నపేట మండలంలో ఈనెల 11న జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలలో ఎవరైనా కోడ్ ను ఉల్లంఘించిన, అధికారుల విధులకు ఆటంకాలు కలిగించిన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు . ప్రజలు అధికారులకు సహకరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ప్రజలు ఇరు పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ కోరారు. అలాగే ఓటర్లను మభ్య పెట్టేందుకు అభ్యర్థులు డబ్బులు, మద్యం పంపిణీ చేసే చట్టరితే నేరమని అన్నారు. ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.