ప్రజావాణికి దరఖాస్తులు శూన్యం.. అధికారుల డుమ్మా!
పాపన్నపేట,సెప్టెంబర్,28(మెదక్ టుడే)ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి పాపన్నపేటలో స్పందన కరువైంది. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించగా ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో వివిధ శాఖల అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అబ్కారీ, పోలీస్ శాఖల నుంచి అధికారులు డుమ్మల పర్వం కొనసాగుతుంది.ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాల్సిన కార్యక్రమంలో అధికారుల గైర్హాజరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విష్ణువర్ధన్...