ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం- మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు.

పాపన్నపేట,మే,4,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, ప్రజావాణిలో బాధితులకు భరోసా కల్పించిన మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు,ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీకి నేరుగా విన్నవించుకున్నారు.ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని...