ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు కీలకం – జిల్లా ఎస్ పి, శ్రీనివాస రావు..
మెదక్,డిసెంబర్,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,స్థానిక సంస్థల ఎన్నికలు మెదక్ జిల్లాలో శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఓటరు మరియు ప్రతి పౌరుడు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ముఖ్య సూచనలు జారీ చేశారు.ఓటర్లకు ఎస్పీ సూచనలు:మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదో లేదో తప్పనిసరిగా పరిశీలించండి.మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే తెలుసుకోండి.పోలింగ్ రోజున EPIC / ఓటర్ ID / ఇతర వ్యాలిడ్ ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా...