మెదక్,డిసెంబర్,8,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,స్థానిక సంస్థల ఎన్నికలు మెదక్ జిల్లాలో శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఓటరు మరియు ప్రతి పౌరుడు సహకరించాలని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ముఖ్య సూచనలు జారీ చేశారు.ఓటర్లకు ఎస్పీ సూచనలు:మీ పేరు తాజా ఓటర్ జాబితాలో ఉన్నదో లేదో తప్పనిసరిగా పరిశీలించండి.మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ముందుగానే తెలుసుకోండి.పోలింగ్ రోజున EPIC / ఓటర్ ID / ఇతర వ్యాలిడ్ ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురండి.తెలియని వ్యక్తులకు ఓటర్ ID లేదా ఓటర్ స్లిప్ ఇవ్వకూడదు.పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి సిబ్బంది సూచనలు పాటిస్తూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి.పోలింగ్ కేంద్రం పరిసరాల్లో, ముఖ్యంగా 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధం.ఎవరు ప్రచారం చేసినా, బెదిరించినా,మభ్యపెట్టినా వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వండి.వికలాంగులు, వృద్ధులు, మహిళలకు ముందుగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించండి,వేరొకరి పేరు మీద ఓటు వేయడానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరం; అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడడం నిషేధం; ఉల్లంఘనలపై చర్యలు తీసుకోబడతాయి.కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి.సౌండ్ సిస్టమ్, బాణాసంచా వినియోగం కోసం కూడా పోలీసు అనుమతి తప్పనిసరి.ఎన్నికలు శాంతియుతంగా జరగేందుకు నియమాలు పాటిస్తూ, ప్రజాస్వామ్య హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఎస్పీ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు.